వాట్సాఫ్తో జాగ్రత్త..!
– హాట్ సింబల్ పంపితే జైలుకే
– ఎక్కడ అమలు చేస్తున్నారంటే..?
దర్శిని డెస్క్: మోబైల్ ఉన్న వారికి వాట్సాప్ గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలో ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉన్న సామాజిక ప్లాట్ ఫారమ్. వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్డేట్లను తీసుకవస్తుంది. వాట్సాప్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.. అనవసరంగా, పొరపాటున చేసిన సందేశాలకు జైలు శిక్ష తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వాట్సాప్లో హాట్ సింబల్ పంపితే కారాగారం వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఈ శిక్షను ఎక్కడ అమలు చేస్తున్నారంటే..? సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో రూల్స్ కొంచం స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇప్పటికే అక్కడ అనేక రకాల చట్టాలు తీసుకొచ్చారు కూడా.. తాజాగా సౌదీ అరేబియా, కువైట్లో వాట్సాప్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపడం నిషేధించింది. ఇలా అమ్మాయిలకు హార్ట్ సింబల్ పంపడం పంపడం చట్టం ప్రకారం నేరం అని తెలిపింది. కువైట్లో హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్ల అంటే ఇండియన్ రూపీస్ ప్రకారంరూ.5,35,825 జరిమానా విధిస్తున్నారు. అలాగే సౌదీలో రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష అలాగే 100,000 సౌదీ రియాల్స్ , ఇండియన్రూ రూపీస్ ప్రకారం రూ 21,93,441 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి…

