సంక్రాంతి హాలిడేస్ డిక్లేర్
– మొత్తం ఆరు రోజులు సెలవులు
– ప్రకటించిన విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు డిక్లేర్ అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 12 నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. 13న రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక 14న ఆదివారం భోగి పండుగ వచ్చింది. 15వ తేదీన సంక్రాంతి కాగా, 16న కనుమ పండుగ ఉంది. ఇక 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇచ్చింది. మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.
ఇదికూడా చదవండి…

