జున్నులో ఎనర్జీ..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

జున్నులో ఎనర్జీ..!
– శరీరానికి అధిక పోషకాలు
– ఎముకలు, దంతాలపై ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని డెస్క్ : జున్ను పాలు.. శరీరానికి ఎనర్జీ, అధిక పోషకాలను అందించే పదార్థం. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. జున్నుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలతో జున్నును తయారు చేస్తారు. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి. ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం , జింక్ కలిగి ఉంటాయి.

తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరికి మలబద్దకం అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచూ జున్ను తినేవారిలో మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. గర్భిణి స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే మంచిది. జున్ను తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది.

మితిమీరి జున్ను తింటే అది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. జున్నును ఎక్కువగా తినడం మంచిది కాదు. జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం మోతాదుకు మించి తినకూడదు అనే మాట జున్నుకు వర్తిస్తుంది.

ఇదికూడా చదవండి…

ఫూల్ మఖానాలో ఫుల్‌ హెల్త్..!