మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

దీంతో ఉత్తర తెంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

