గ్రేట్.. ఉమా దేవీ..!

కెరీర్ తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

గ్రేట్.. ఉమా దేవీ..!
– తాండూరు మహిళకు గ్లోబల్ ఇన్స్పీరేషన్ అవార్డు
– జ్యూట్ బ్యాగు తయారి, విక్రయాలకు గాను పురస్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపార రంగాలలో పురుషులకు ఏమాత్రం తగ్గమని కొందరు మహిళలు నిరూపిస్తుంటారు. ఇదే కోవలో రాణిస్తున్న తాండూరుకు చెందిన ఉమాదేవి ఉత్తమ అవార్డును సాధించి గ్రేట్ అని అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జ్యూటీఫై పేరుతో వ్యాపార సంస్థను నిర్వహించారు. ఇందులో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే జ్యూట్ బ్యాగులను తయారు చేస్తున్నారు.

అవసరాలకు, శుభకార్యాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేయడంతో పాటు ఆకర్షీయమైన విధంగా బ్యాగులను తయారుచేసి విక్రయిస్తున్నారు. అయితే ఢిల్లీలోని గ్లోబల్ వుమెన్(జీడబ్ల్యూఐఏ) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాప్‌ 100 ఇన్ప్సిప్రేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి ఉమాదేవి ఎంపికైంది. జ్యూట్‌ బ్యాగుల తయారిని అభినందిస్తూ జీడబ్ల్యూఐఏ సంస్థ ద్వారా తాండూరుకు చెందిన ఉమాదేవి ఇన్స్పిరేషన్ అవార్డును సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పొందింది. ఈ సందర్భంగా ఉమాదేవికి పలువురు నుంచి అభినందనలు వెలువెత్తాయి. జ్యాట్ బ్యాగుల తయారి, ఉపాధి రంగంలో రాణించడం పట్ల అమె కృషికి అందరు ఫిదా అవుతున్నారు.

ఇదికూడా చదవండి…

ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలి