ఆరోగ్య వరాల ఉసిరి..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఆరోగ్య వరాల ఉసిరి..!
– రోజూ తీసుకుంటే ప్రయోజనాలు
– సంతనోత్పత్తి సామర్థ్యం పెంపు
– ఎముకలు, దంతాలు, వెంకట్రలకు ఆరోగ్యం
దర్శిని డెస్క్ : ఔషధ గుణాలు మెండుగా ఉండే ఉసిరి ఆరోగ్య సిరిగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ఒక దివ్య ఔషధంగా పని చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తిక మాసంలో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఈ ఉసిరి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.రుచిలో ఇది పుల్లగా, వగరుగా ఉండే ఉసిరిని ఆరోగ్యాల సిరిగా అభివర్ణిస్తారు. ఉసిరి బెరడు, కాయ, పండు, ఉసిరి కాయ రసంలోని ఔషదాలు ఆరోగ్యానికి వరంగా పనిచేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. మెదడు పనితీరును మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మహిళల్లో బహిష్టు సమస్యల్ని తొలిగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. కఫ దోషాల్ని నివారించి.. ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది.

మలబద్దకానికీ మంచి మందు. వెంట్రుకల సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. దీంతో చేసే షాంపూలూ, నూనెలూ జుట్టుకు ఎంతో మంచి చేస్తాయి. చుండ్రు, తెల్లని జుట్టును నల్లగా మార్చడంలో ఇది బాగా పనిచేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరిలో మెండుగా ఉన్నాయి.

ఎండ వేడిమి నుంచి చర్మ రోగాల నుంచి కాపాడి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఉసిరి రోజు తింటే కాల్షియం పెరిగి ఎముకలు, దంతాలు, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. లైంగిక సామర్థ్యాన్ని, వీర్య సమృద్ధికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది.

ఉసిరిలో క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్, కొరిలాగిన్, ఎల్లాజిక్ యాసిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ మంచి మొత్తంలో ఉన్నాయి. ఇవి శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసి, కాలేయ పని తీరును మెరుగు పర్చడానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఉసిరి తీసుకోవడం వల్ల రక్తం గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే క్రోమియం అనే మినరల్ శరీరం యాంటి డయాబెటిక్ ప్రభావానికి గురయ్యేలా చేస్తుంది.

ఉసిరి తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలేస్ట్రాల్ నియత్రించడంలో ఉసిరి సాయపడుతుంది. ఉసిరి శరీరంలో పీపీఏఆర్ స్థాయిని పెంచుతుంది. తద్వారా ఎల్ డీ ఎల్, వీ ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు ట్రై గ్లిజరాయిడ్స్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

ఇదికూడా చదవండి…

మునగాకు లడ్డు వెరి గుడ్డు..!