భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు
– దాసోహంతో దేవాలయంకు పూర్వవైభవం
– పాలకవర్గం, వీరశైవుల సమన్వయం అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా అన్నపూర్ణ దాసోహ మందిరం ప్రారంభం
– వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాకారంతో తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం భద్రేశ్వర దేవాలయంలో రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ ల ఆధ్వర్యంలో అన్నపూర్ణమాత దాసోహ(నిత్య అన్నదాన సత్రం) మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.

ఇందులో భాగంగా దేవాలయంలో అన్నపూర్ణ మాత విగ్రహా ప్రతిష్టాపనతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దాసోహ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా దేవాలయంలో జరిగిన ప్రత్యేక హోమం. పూజలు. శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుతవ్ సహాకారంతో పూర్తి సహాకారం అందిస్తామన్నారు. దేవాలయంలో పూర్వం ఉన్న దాసోహ మందిరం నిర్మాణంలో పాలకవర్గ సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు సమన్వయంతో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. దాసోహంతో నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా దేవాలయానికి పూర్వవైభవం వస్తుందని అన్నారు.

అదేవిధంగా వచ్చే జాతర ఉత్సవాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయంలో భద్రేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్. మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు బంటు వేణు. దేవాలయ పాలకవర్గ సభ్యులు జాక సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, కల్లూరు బస్వరాజ్, కోటం సిద్ధలింగం. ఎం. ప్రశాంత్, గాదిగి కిరణ్ కుమార్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్. బస్వరాజ్, సభ్యులు జొన్నల బస్వరాజ్. గాజుల శాంతుకుమార్, పరమేశ్వర్, వీరశైవ యవదళ్, వీరశైవ అక్కమాదేవి మహిళ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

