వామ్మో… ఎంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్…!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

వామ్మో… ఎంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్…!
– తాండూరు మీదుగా భారీ కంటైనర్‌తో తరలింపు
– ఆశ్చర్యంతో పరిశీలించిన పట్టణ వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్‌ సరఫరా నియంత్రణలో వినియోగించే ట్రాన్స్‌ ఫార్మర్లు చూసే ఉంటారు. అవి స్మాల్, మీడియం లెవల్లో ఉంటాయి. పరిశ్రమల కోసం పెద్ద పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తుంటారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు మీదుగా ఓ పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించారు.

భారీ కంటైనర్‌లో ఉంచి తరలించారు. ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎన్నడూ చూడని ప్రజలు ఆశ్చర్యానికి పరిశీలించారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ లో దీనిని తయారు చేసినట్లు రవాణా ప్రతినిధులు తెలిపారు. సుమారు 64 హైడ్రాలిక్ టైర్లతో వీల్ అడ్జట్స్‌మెంట్‌తో తీసుకెళుతున్నట్లు తెలిపారు. చెన్నైలోని ఓ కంపెనీ కోసం దీనిని తీసుకెళుతున్నట్లు వెల్లడించారు. తాండూరు పట్టణం మీదుగా తరలించే క్రమంలో పట్టణంలోని విద్యుత్ వైర్లు అడ్డు తగలకుండా స్థానిక విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణం మీదుగా వెళ్లిన పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ దృశ్యాలను చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇదికూడా చదవండి…

నల్ల యాలకుల్లో ఆరోగ్య మంత్రం..!