తాండూరుకు మళ్లీ ఎమ్మెల్యే.. రోహిత్ రెడ్డినే..!
– బీఆర్ఎస్ మహిళా కన్వినర్ శకుంతల దేశ్పాండే
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకురాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి మళ్లీ కాబోయే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డినే అని బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ శకుంతల దేశ్పాండే అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డిని శకుంతల మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలు, అభిమానుల మద్య రోహిత్ రెడ్డికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్న వయస్సుల్లోనే తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి పదవిని చేపట్టి అభివృద్ధి, సంక్షేమంలో తనదైన ముద్రవేశారని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజల్లో ఆయనకు ఇంకా అభిమానం, ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేది రోహిత్ రెడ్డినే అని ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం, రోహిత్ రెడ్డి కోసం పనిచేస్తామన్నారు. అదేవిధంగా పలువురు నాయకులు. కార్యకర్తలు భారీగా తరలివచ్చి రోహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి...

