మహిళలకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్టౌ..!
– వంట గ్యాస్ లేకుండా వినియోగం
– అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
– ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : పెరుతున్న గ్యాస్ ధరలు, ఆరోగ్య సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలపై శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఓ పథకం అమలు చేస్తోంది. అదే ‘సూర్య స్టౌ’ పథకం. ఈ పథకం కింద దేశంలోని మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ సోలార్ స్టౌ అందిస్తోంది. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకొస్తోంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, వంటింట్లో మహిళలు గ్యాస్, కట్టెల పొయ్యిల వాడకం వల్ల పొగబారిన పడి ఆస్తమా, ఇతర శ్వాస కోశ వ్యాధులకు గురవుతున్నారు. దాని నుంచి విముక్తి కల్పించడానికి కేంద్రం సంకల్పించింది. అందుకు ‘సూర్య స్టౌ’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఎలా పనిచేస్తుందంటే…?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని కేంద్రం అభివృద్ధి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో దీనిపై గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన లేకపోవటంతో పథకం అమలుకు నోచుకోక మరుగున పడుతోందనే విమర్శ వినిపిస్తోంది. దీనిద్వారా గ్యాస్ స్టౌకు బదులుగా సౌర శక్తితో వంట చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా దీనివల్ల ఆర్థిక పొదుపు కూడా ఉంటుంది. ఈ స్టవ్‌ను మహిళలకు ఉచితంగానే అందజేయనున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే..?
ఇంటర్నెట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇండియన్ ఆయిల్ బిజినెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇండోర్ సోలార్ కుక్కర్ లింక్‌పై క్లిక్ చేయాలి. అందులో ఫ్రీ బుకింగ్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ అని కనిపిస్తుంది. అక్కడ అడిగిన వివరాలతో పాటు అధార్, పాన్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం సమర్పించాలి. అనంతరం సబ్మిట్పై క్లిక్ చేయాలి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ దరఖాస్తు సమర్పితం అయినట్లుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

అర్హతలు ఇవే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏజెన్సీల ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు సేవలు అందుతాయి. ప్రతి కుటుంబం ఒకే సభ్యుని ద్వారా మాత్రమే పథక ప్రయోజనాలకు అర్హులు. ఆదాయ అర్హత: వార్షిక ఆదాయం రూ. 2,50,000 కంటే తక్కువ ఉన్న కుటుంబాల మహిళలు ఈ పథకానికి అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలు ఉన్న మహిళలకు అర్హత వర్తిస్తుంది.

ఇదికూడా చదవండి…

