టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..!
– ఈ సింపుల్‌ పనిచేస్తేనే వర్క్ అవుతుంది
– 200ల ట్రిప్పుల దాకా పైసా కట్టాల్సిన పనిలేదు
– ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..
దర్శిని డెస్క్ : భారత ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించడానికి ఫాస్టాగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వాహనదారులు ఎలాంటి వెయిటింగ్ లేకుండా చాలా సింపుల్‌గా టోల్ ప్లాజాలను దాటేస్తున్నారు. గతనెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన స్కీం వాహనదారుల పాలిట వరంగా మారింది. ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే టోల్ గేట్లను ప్రీగా దాట వేసే సదుపాయాన్ని పొందవచ్చు.
kvcs
ఒకటి కాదు రెండు కాదు 200ల ట్రిప్పుల వరకు పైసా కట్టాల్సిన పనిలేదు. అదే ఫాస్టాగ్ స్కీం. ఈ స్కీంలో కేవలం రూ.3,000 చెల్లిస్తే ఏడాది పాటు 200 ట్రిప్పులు జాతీయ రహదారులపై టోల్ ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సౌకర్యం ఆగస్టు 15 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవడం వినియోగదారులకు చికాకు తెప్పిస్తుంది. ఒకవేళ సరిపడా బ్యాలెన్స్ లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లైన్‌ను క్రాస్ చేస్తే జరిమానా చెల్లించాల్సి రావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఒక్కోసారి కారుతో టోల్ గేట్ దాటితే కనీసం రూ.120 ఖర్చు అవుతుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ స్కీమ్ వాహనదారులకు ఊరట కలిగించేలా మారింది.

ఫాస్ట్ ట్యాగ్‌లో క్యాష్ లోడింగ్ కోసం అనేక విధాలుగా చేయవచ్చు. Paytm, PhonePe లేదా Google Pay వంటి పేమెంట్ యాప్స్ వినియోగించవచ్చు. మీరు FASTag వాడేందుకు కొత్తవారైతే మీరు వివిధ యాప్స్ ద్వారా ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పేటీఎం ఉపయోగించి FASTag రీఛార్జ్ చేయడం ఎలా? :
మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
యాప్‌లోని ఫాస్ట్ ట్యాగ్ సెక్షన్‌కు నావిగేట్ చేయండి.
మీరు ఈ కిందికి స్క్రోల్ చేసి చూడవచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.
మీ వాహన వివరాలను ఎంటర్ చేయండి.
పేటీఎం వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఏదైనా మెథడ్ ఉపయోగించి పేమెంట్ పూర్తి చేయండి.

గూగుల్ పేతో రీఛార్జ్ చేయడం
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో గూగుల్ పే అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు, యాప్‌లోని పేమెంట్ బిల్లుల సెక్షన్‌కు వెళ్లండి.
ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
ఆ తరువాత పేమెంట్ కేటగిరీలపై ట్యాప్ చేయండి.
ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకు, వాహనం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ఎంచుకుని ఆపై రీఛార్జ్ బటన్‌పై ట్యాప్ చేయండి.
మొత్తాన్ని ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేస్తే చాలు..

ఫోన్‌పేతో రీఛార్జ్ చేయడం
PhonePe అప్లికేషన్ ఓపెన్ చేయండి.
రీఛార్జ్, పేమెంట్ బిల్స్ సెక్షన్‌కు వెళ్లండి.
ఇక్కడే FASTag రీఛార్జ్‌ ఎంచుకోండి.
మీ బ్యాంక్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ ఎంటర్ చేయండి.
కన్ఫర్మ్ చేయండి. ఆపై పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
రీఛార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి పేమెంట్ చేయండి.
మీ FASTag అకౌంట్ బ్యాలెన్స్‌ క్రెడిట చెక్ చేయండి.

ఇదికూడా చదవండి…

బీసీల అభ్యున్నతి మార్గదర్శకులు మాణిక్ రావు