
ప్రాణాపాయంలో సాయం..!
– బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
– పదో తరగతి పూర్వ విద్యార్థుల ఉదారత
తాండూరు, దర్శిని ప్రతినిధి : హితం కోరేవారు స్నేహితులు.. వీరంతటితో ఆగలేదు.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి తమతో కలిసి చదువుకున్న మిత్రుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే చలించి పోయారు. స్నేహితుని కుటుంభానికి ఆర్థిక చేయూతను అందించేందుకు చేయి చేయీ కలిపారు. దోస్తును కాపాడునేందుకు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జక్కెపల్లి గ్రామానికి చెందిన డక్కలి జగ్గప్ప కరాటే మాస్టర్‌గా ఉన్నారు.

శుక్రవారం కుమారుడు బ్రూస్లీతో కలిసి బైకుపై తాండూరుకు వచ్చాడు. పనిముగించుకుని తిరిగి అదే బైకుపై స్వగ్రామానికి బయల్దేరాడు. మండల సరిహద్దులోని బైపాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా కోడిగుడ్ల లోడ్‌తో వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీ కొట్టింది. ఈప్రమాదంలో జగ్గప్పకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గప్ప పదో తరగతి స్నేహితులు చలించిపోయారు.

పూర్వ విద్యార్థులు కొంత మంది తోచిన సాయంను అందించాలని నిర్ణయించుకున్నారు. రూ. 11వేల నగదను సేకరించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న జగ్గప్ప కుటుంబాన్ని కలిసి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రాణాపాయంలో ఉన్న స్నేహితునికి కోసం వారు అందించిన సాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

