లోకల్‌ ఫైట్‌కు సైరన్‌..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

లోకల్‌ ఫైట్‌కు సైరన్‌..!
– స్థానిక ఎన్నికలకు మోగిన నగారా
– ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ ఇదే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : గత కొన్ని నెలలుగా ఉత్కంఠతకు గురిచేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సైర్ మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రాణికుముదిని వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇక పంచాయతి ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
kvcs

ఎన్నికల నిర్వహణ ఇలా
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. అక్టోబర్‌ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో విడత నవంబర్‌ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్‌ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపారు. (Telangana Local Body Elections Schedule) రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు.

ఇదికూడా చదవండి….

శాంతినగర్ లో ఘనంగా బతుకమ్మ