అభివృద్ధే ప్రధాన లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధే ప్రధాన లక్ష్యం..!
– 36వ వార్డు సమస్యలు పరిష్కరిస్తా
– వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 36వార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, యువ న్యాయవాది కల్వ సిరి చందన అన్నారు.శుక్రవారం వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికి తిరుగుతు చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వార్డును అభివృద్ధి పరచడమే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరిస్తున్నారు. అధికార పార్టీతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు వివరించారు.

అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలాంటి నాయకులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. అందరికి అందుబాటులో ఉండి నాయకురాలుగా కాకుండా సేవకురాలుగా పనిచేస్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కోసం చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, మహిళలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆరు గ్యారెంటీలకు ఆగమైనమ్..!