అల్లం నీరు తాగితే.. రోగాలకు దూరం

ఆరోగ్యం తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

అల్లం నీరు తాగితే.. రోగాలకు దూరం
– ఆరోగ్యానికి, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు మేలు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు వంటింట్లో ఉండే అల్లం గొప్ప ఔష‌దం ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. అల్లంలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. ప్ర‌తిరోజూ వివిధ రూపాల్లో అల్లంను తీసుకుంటే రోగాల‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అల్లం నీరు తాగడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుందని మీకు తెలుసా..? ఇది నీరు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
సాధారణంగా కొంత మంది ఈ వింటర్ సీజన్‌లో అల్లం టీని దాదాపు ఇష్టంగా తయారు చేసుకోని తాగుతుంటారు. అల్లం టీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ టీ కంటే.. అల్లం టీ తాగడం మేలని చెబుతుంటారు. అల్లంలోని ఔషధాలు ఇమ్యూనిటీని పెంచడంతోపాటు.. ఉదరం, జీర్ణక్రియ వ్యవస్థకు మేలు చేస్తాయి. దీంతోపాటు జలుబు, ఫ్లూను నివారించడంలో అల్లం ఔషధంగా మారుతుంది. క్రమం తప్పకుండా అల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పడు ఓ సారి తెలుసుకుందాం.

1- చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు దోహదం
అల్లం నీరు మ‌న చర్మ సంర‌క్ష‌ణకు దోహ‌ద ప‌డుతుంది. అల్లం నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర కాంతి పెరుగుతుంది. దీనితో పాటు మొటిమలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం మెరవాలంటే.. అల్లం నీళ్లు తాగాలి. అంతేకాకుండా అల్లం నీరు తాగడం వల్ల రక్తం శుభ్రపడి.. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

2- రోగనిరోధక శ‌క్తి పెంపు
అల్లంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మెండుగా ఉంటుంద‌ని వైద్య, ఆయుర్వేద నిఫులు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జలుబు-దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోనివివిధ రకాల నొప్పులకి అల్లం ఒక దివ్యమైన ఔషదంగా పనిచేస్తుంది. దీంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

3- బరువు తగ్గడంలో
బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి అల్లం నీరు మంచి ఔష‌దంలా ప‌నిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తొలగిపోయి.. బరువును తగ్గిస్తుంది. మీ బరువును సులభంగా తగ్గించుకోవాలనుకుంటే.. అల్లం నీటిని ప్రతిరోజూ తాగాలి. ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

4- వివిధ రోగాల నుంచి రక్షణ
అల్లంతో వివిధ రోగాల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే ఔషధాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అల్లం తీసుకోవడం వల్ల గుండె సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. హృదయ వ్యాధుల చికిత్సలో అల్లంను ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు మ‌ధుమేహం, మూత్ర‌పిండాల స‌మస్య‌లు కూడ దూర‌మ‌వుతాయి.