శివపార్వతుల కళ్యాణ వైభోగం

తాండూరు రాజకీయం వికారాబాద్

శివపార్వతుల కళ్యాణ వైభోగం
– వేద పండితుల సమయంలో కళ్యాణోత్సవం
– తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, నేతలు
– చెంగోల్‌లో ముగిసిన మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామ శివారులోని మల్లికార్జున స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభోగంగా జరిగింది. దేవాలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం దేవాలయంలో రుద్రాభిషేకం, బోనాలు, పల్లకి సేవ, భజన కార్యక్రమమాలు నిర్వహించారు. అదేవిధంగా శుభముహుర్తములో శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు.

శివుని తరుపున తాండూరు సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు, పార్వతి దేవి తరుపున సూర్యవంశీ ప్రియపవన్ దంపతులు పాల్గొన్నారు. మహాంతయ్య, కిషోర్ పంతులు, చిరంజీవి పంతులు, తిరుమల పంతులు వేదమంత్రాల మధ్య శివ పార్వతుల కళ్యాణం అంగరంగా కన్నుల పండుగలా జరిగింది. కళ్యాణోత్సవం, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తుల భజన కీర్తనలు మార్మోగాయి. అనంతరం ఆలయ కమిటి వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, హన్మయ్యల ఆధ్వర్యంలో సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఆలయ కమిటి ప్రతిధులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవంలో తాండూరు జెడ్పీటీసీ గౌడ్ మంజుల, సర్పంచ్ మల్లీశ్వరీ గౌడ్, ఎంపీటీసీ రత్నమాల రాము, రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ వేణుగౌడ్, మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస చారి,

మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్‌ రత్నామాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయాదేవి, వెంకన్న గౌడ్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, నర్సింలు యాదవ్, మధుసూదన్, సాగర్ గౌడ్, కృష్ణయ్య, గోపాల్ కిరణ్, ఉపాధ్యాయులు జొన్నల వినోద్ కుమార్, రాకేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, మనోహర్ యాదవ్, వివేకానంద యువజన సంఘం సభ్యులు రాము యాదవ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.