హాట్రిక్ కొట్టిన అబ్దుల్ రజాక్
– మున్సిపల్ ఎన్నికల్లో మూడోసారి విజయం
– కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో గెలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ రజాక్ హాట్రిక్ కొట్టారు. వరుసగా మూడో సారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.

శుక్రవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన గెలుపును ప్రకటించారు. 468 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో దూసుకపోతున్న హస్తం ఖాతాలో మరో గెలుపును సొంతం చేసుకుంది. ఎన్నికల్లో హాట్రిక్ కొట్టిన కౌన్సిలర్ అబ్దుల్ రజాక్‌ను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అంతకుముందే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అబ్దుల్ రజాక్‌కు అభినందనలు తెలిపారు.


