ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు
– జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం, పండ్ల పంపిణీ
– ఉత్సాహంగా కేక్ కట్ చేసిన మిత్రులు, ఆప్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం శంకర్ యాదవ్ మిత్రులు బంటు మల్లప్ప ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు అల్పాహారం అందించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో బంటు మల్లప్పతో పాటు శంకర్ యాదవ్ తండ్రి బావనోళ్ల హమ్మయ్య పాల్గొని రోగులకు పండ్లు అందించారు.

అనంతరం శంకర్ యాదవ్ నివాసంలో మిత్రులు, ఆప్తులు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ మిత్రులు, ఆప్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

మట్టి గణేషునికి జై..!