వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
– సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నల్లని వాడు, అల్లరివాడు, గోపికలోలుడు, యశోధ తనయడు, దేవకీ వసుదేవ సుతుడు, యోగీశ్వరుడని పేరొందిన శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్లో కన్నుల పండువగా జరిగాయి.

విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేశాదారణతో కోలాటంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దశావతారాల వేశాదారణలో ఉన్న చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. శ్రీ కృష్ణుని వేషంలో ఉన్న చిన్నారులు పోటీపడి పైకెగురుతూ పెరుగు ఉట్టిని పగులగొట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరుణంలో పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు భగవత్గీత శ్లోకాలు పఠించాలని సూంచారు.
ఆంగ్లమాధ్యమంలో చదివిన మన భారతీయ సంస్కృతిని మరవకూడదన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు విద్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


