స్టేషన్‌ హనుమాన్‌ ఆలయానికి నోటిఫికేషన్‌!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్టేషన్‌ హనుమాన్‌ ఆలయానికి నోటిఫికేషన్‌!
– ధర్మకర్తల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌
– పాలక మండలి సభ్యత్వానికి దరఖాస్తులు
– ప్రకటించిన ఆలయ ఈఓ శేఖర్‌గౌడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు స్టేషన్‌ హనుమాన్‌ ఆలయానికి వారసత్వేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శేఖర్‌గౌడ్‌ తెలిపారు.

ధర్మకర్తల నియామకానికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. అక్టోబరు 1న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, ధర్మకర్తల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్థానిక భాషా దినపత్రికలో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

నోటిఫికేషన్‌ ప్రచురణ అనంతరం తదుపరి నియామక ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయ పాలక మండలిలో సభ్యులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్నవారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఈఓ శేఖర్‌గౌడ్‌ సూచించారు.

ధర్మకర్తల నియామకానికి సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సీఎం గారు.. మా గోడు వినండి!