ఇక రైతుల చేతికే డ్రోన్‌ సేవలు..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇక రైతుల చేతికే డ్రోన్‌ సేవలు..!
– రేపు తాండూరులో ‘బుక్‌ మై డ్రోన్‌’ యాప్‌ ప్రారంభం
– పంటల సాగులో మందుల పిచికారికి వినియోగం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తాండూరులో మరో ముందడుగు పడనుంది.

రైతులు తమ పంట పొలాల్లో డ్రోన్‌ ద్వారా పిచికారీ సేవలను సులభంగా పొందేందుకు రూపొందించిన ‘బుక్‌ మై డ్రోన్‌’ మొబైల్‌ యాప్‌ను తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం (ఏఆర్‌ఎస్‌)లో ప్రారంభించనున్నారు. డిజిటల్ అగ్రికల్చర్-ఎన్‌ఈజీపీఏ- తలెంగాన ప్రభుత్వం సహాకారంతో రేపు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకవస్తున్నారు.

ఈ వ్యవస్థ ద్వారా రైతులు స్థానిక డ్రోన్‌ పైలట్లతో నేరుగా అనుసంధానమై తమ అవసరాలకు అనుగుణంగా సేవలు పొందవచ్చు. పంట పొలాల్లో పురుగుమందులు, ఇతర అవసరమైన ద్రావణాల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యాప్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రోన్‌ సేవలను సులభంగా పొందడంతో పాటు పిచికారీ పనులను వేగంగా పూర్తి చేసుకునేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.

రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారులు, డ్రోన్‌ పైలట్ల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ యాప్‌ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు (ఏఓలు), వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), అగ్రిహబ్‌, ఐఎల్‌ఏ అగ్రి సర్వీసెస్‌ సిబ్బంది పాల్గొననున్నారు. ఆధునిక వ్యవసాయ సేవలను అందిపుచ్చుకునేందుకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Pvr

దుర్గమ్మ సేవలో చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి