అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..!
– కాళికా దేవికి పట్టు వస్త్ర సమర్పణ
– నవరాత్రి వేళ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
– ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మవారిపై అపారమైన భక్తిని చాటుకుంటూ. ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్‌రెడ్డి నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తాండూరులోని కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాన్ని సమర్పించారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజల జీవితాల్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కౌన్సిలర్లు, అభిమానులు తదితరులున్నారు.

Pvr

దసరా ఉత్సవాలకు దస్తగిరిపేట్‌ వేంకటేశ్వర ఆలయం ముస్తాబు!