తుల్జా భవానీ మాతను దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

తుల్జా భవానీ మాతను దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి
– బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు
– మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన స్థానిక మేయర్‌, ఆలయ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తుల్జాపూర్‌ శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు.

ధారాశివ్‌ జిల్లాలోని ఆలయానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి చేరుకున్న ఆయనకు స్థానిక మేయర్‌, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, బీఆర్‌ఎస్‌వీ నాయకులు, అభిమానులు అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆదివారం సాయంత్రం తుల్జాపూర్‌లో పాదయాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మహాప్రసాద కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం సోమవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ!