విలనీయుడు… అమ్మ సేవలో కారుణ్యుడు..!
– తల్లికి సపర్యలు చేస్తున్న బాలివుడ్ చోటా విలన్
– ఇంటర్నెంట్‌లో యాక్టర్ ప్రదీప్ కాబ్రా వీడియో వైరల్
దర్శిని డెస్క్ : పరమాత్ముడు అయినా.. పాపాత్ముడైనా తల్లికి కొడుకే. ఎవ్వరు ఎంత ఎదిగినా తల్లి సేవలో తరిస్తారు. ఎందుకంటే చిన్న నాటి నుంచి బిడ్డ ఎదిగే వరకు ఆ తల్లి కుడుకు.. కూతుళ్లకు ఎంతో సేవ చేస్తుంది. ఎలాంటి కల్మసం లేని ప్రేమతో పెంచిన అమ్మకు అందరు సపర్యలు చేస్తూ పుణ్యం మూటకట్టుకుంటారు. అయినా అమ్మ రుణం తీర్చలేనిది. ఇలాంటి సందర్భాలు అందరి జీవితాలలో జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ పురాణం ఎందుకంటే తల్లిపై ఓ బాలివుడ్ చోటా విలన్ తల్లికి చేస్తున్న సేవలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ప్రదీప్ కాబ్రా.. ఈయనో బాలీవుడ్ చోటా విలన్. అక్కడి చిత్రాలలో మేయిన్ విలన్ గ్యాంగ్‌లో సపోర్ట్ రోల్‌లో నటించాడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సూపర్ రజనీకాంత్ దర్బార్ చిత్రంలో కూడ నటించాడు. మహేష్ బాబు దూకుడు చిత్రంలో విలన్‌కు హిరో గురించి చెప్పేటప్పుడు బాలీవుడ్ హిరోలా ఉంటాడని వివరిస్తాడు. చాలా సినిమాలలో గుండుతో కనిపిస్తాడు. అయితే తెరపై రాక్షసుడుగా కనిపించే ప్రదీప్ కాబ్రా నిజజీవితంలో సున్నితస్తుడు. తాజాగా వైరల్ భయాని అయే ఫిల్మ్ ఫోటో గ్రాఫర్ తన ఇస్టాగ్రామ్ ద్వారా ప్రదీప్ కాబ్రా తన తల్లిపై ప్రేమను పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ విడియో వైరల్ అవుతోంది.

చిన్న చితక పాత్రలు చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ప్రదీప్ కాబ్రా తల్లి పదేళ్ల క్రితం పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ప్రదీప్ తల్లి సేవలకు పరిమితమయ్యాడు. ప్రతి రోజూ అమ్మకు ఫిజియో థెరపీ చేయిస్తున్నాడు. ఇందుకోసం అమ్మను వీపుపై మోసుకుని బయటి నడకు తీసుకవస్తున్నాడు. చిన్నతనంలో తన తల్లి తనకు ఎలాంటి సేవలు చేసిందో ఇప్పుడు అలాంటి సేవలను అందిస్తున్న ప్రదీప్ కాబ్రాపై పలువురు అభినందలన వర్షం కురిపిస్తున్నారు. అందరి ఆశీస్సులతో తల్లి ఆరోగ్యం కుదుట పడాలని, ప్రదీప్‌కు మంచి జరగాలని కామెంట్ల రూపంలో అభినందలు తెలుపుతున్నారు. విలనీయుడులో కారుణ్యుడు అంటూ అభినందిస్తున్నారు.
https://www.instagram.com/reel/CXWMVcVKBUt/?utm_source=ig_web_copy_link



