అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబ‌రాలు

తాండూరు వికారాబాద్

అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబ‌రాలు
– ఇండ్ల ముందు ముగ్గులు వేసిన మ‌హిళ‌లు
– ఉత్స‌హాంగా గాలిప‌టాలు ఎగుర‌వేసిన చిన్నారులు
– డూ డూ బ‌స‌వ‌ణ్ణ‌ల సంద‌డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌ర్గంలో మ‌క‌ర సంక్రాంతి సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. శుక్రవారం భోగి పండ‌గ‌ను ఉత్స‌హాంగా జ‌రుపుకున్న ప్ర‌జ‌లు రెట్టించిన ఉత్స‌హాంతో సంక్రాంతిని జ‌రుపుకున్నారు. పండ‌గ సంద‌ర్భంగా మ‌హిళ‌లు, యువ‌తులు ఉద‌యాన్నే లేచి ఇండ్ల ముందు ముగ్గులు వేశారు.
ప‌క్కింటి.. ఎదురింటి వాళ్ల‌తో పోటీప‌డి అంద‌మైన ముగ్గుల‌ను నేల‌దించారు. రంగ‌వ‌ల్లుల‌తో తెలుగు వాకిళ్ల‌న్నీ ఇంద్ర‌ధ‌నుస్సులోని హ‌రివిళ్లుల‌య్యాయి. అనంత‌రం స్నాన‌మాచ‌రించి అంద‌మైన ముగ్గుల్లో గొబ్బెమ్మ‌ల‌ను ఉంచి పూజ‌లు నిర్వ‌హించారు.
అదేవిధంగా పిల్ల‌ల ఆట‌పాట‌లు, గాలిప‌టాల ఎగుర‌వేసే దృశ్యాల‌తో సంక్రాంతి సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. పిల్ల‌లు, స్నేహితులు, బందువులు, కొత్త అళ్లుల్ల‌తో ఇంటింటా సంక్రాంతి సంద‌డిని తెచ్చింది.
ఏడాదికి ఒక‌సారి వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా డూ డూ బ‌స‌వ‌ణ్ణ‌లు అమ్మవార్ల‌కు.. అయ్య‌వార్ల‌కు దండాలు పెట్టి ఆక‌ట్టుకున్నాయి. మ‌రోవైపు తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలో మ‌హిళ కౌన్సిల‌ర్లు, మ‌హిళ నాయ‌కులు సంక్రాంతి ముగ్గులు వేసి మురిసి.. మెరిసిపోయారు. మ‌రోవైపు నియోజ‌క‌ర్గంలోని అన్నిగ్రామాల్లో సంక్రాంతిని ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు.