స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తికి ఆహ్వానం
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారి డా.తుకారం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా వైద్యాధికారి తుకారం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న 22 స్టాప్ నర్సు ఈ పోస్టులను కాంట్రాక్టు పద్దతిన భర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు రూ. 23 వేల వేతనం కూడ అందించడం జరుగుతుందని తెలిపారు. GNM లేదా BSc నర్సింగ్(డిగ్రీ సర్టిఫికెట్ కాపీతో రుజువు అందించాలి), యాక్టివ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ (దయచేసి రుజువు అందించాలి), 34 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగి ఉండడం తప్పనిసరి అని అన్నారు. ఈనెల 3వ తేది నుంచి 5వ తేది సాయంత్రం 5.00 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

