అభివృద్ధిని ఆగనివ్వం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధిని ఆగనివ్వం..!
– సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
– కోఆప్షన్ సభ్యుల వినతికి ఎమ్మెల్యే స్పందన
– మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కోఆప్షన్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అభివృద్ధిని ఎక్కడా ఆగనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు భరోసా అందించారు.

బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని హైదరాబాద్‌లో కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రహీం, సుభాష్‌, అన్వర్‌ ఖాన్‌లతో పాటు సీనీయర్ నాయకులు హరిహరగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో భేటి అయ్యి తాండూరు పట్టణంలోని అభివృద్ధి పనులతో పాటు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా వార్డు నంబర్‌ 10 మైనారిటీ కాలనీలో మధ్యలో నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే కొత్త ఉర్దూఘర్‌–ఫంక్షన్‌ హాల్‌ రోడ్డుతో పాటు వార్డులోని మరో రెండు, మూడు ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. మైనారిటీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కోఆప్షన్ సభ్యులు తెలిపారు. అభివృద్ధి పనులను ఎక్కడా ఆగనివ్వమని, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తామని భరోసా అందించినట్లు తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

అపదలో ఇక 112నే అండ..!