అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను సాధించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను సాధించాలి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– అంబేద్క‌ర్‌కు నివాళులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త‌ర‌త్న, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను అందరు సాధించాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. గురువారం అంబేద్క‌ర్ 131 జ‌యంతి సంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలోని పాత తాండూరు అంబేద్క‌ర్ పార్కులోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి, ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి చైర్ ప‌ర్స‌న్ పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మ‌హానీయుడు అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న‌కు అంద‌రు కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జాబాల్ రెడ్డి, కౌన్సిల‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.