అయ్యో ఆఖీలూ..!

క్రైం తాండూరు వికారాబాద్

అయ్యో ఆఖీలూ..!
– పతంగి కోసం పోతే ప్రాణాలు పోయాయి
– విద్యుత్ ఘాతంతో బాలుడు మృతి
– బషీరాబాద్‌ మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అయ్యో అఖీలూ.. అప్పుడే నూరేళ్‌లు నిండాయా అంటూ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు విద్యుత్ఘానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలోని దామర్‌చేడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దాసరి శివకుమార్ పెద్ద కొడుకు దాసరి అఖిల్ సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో స్నేహితులతో కలిసి గాలిపటాన్ని ఎగిరేయడానికి వెళ్లాడు. గ్రామంలోని పోచమ్మ గుడి దగ్గర పతంగి ఎగిరేస్తున్న క్రమంలో గుడికి గుంజిన సర్వీస్ వైరుకు తగిలి తెగిపోయింది. తెగిపోయిన గాలిపటాని తెచ్చుకోవడానికి అఖిల్ గుడికి గుంజిన సర్వీస్ వైరుకు నుంచి పతంగిని తీసుకుంటున్న క్రమంలో వైరుకు సపోర్టుగా ఉన్న జీయో వైరుకు విద్యుత్‌ సరఫరా కావడంతో ప్రమాద వశాత్తు విద్యుత్ఘానికి గురయ్యాడు. కాళ్లు, గొంతుకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అఖిల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయ్యో అఖీలూ అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరిని కలిచివేసింది.