ఆట‌ల చ‌దువుతో సంపూర్ణ వికాసం

క్రీడలు తాండూరు వికారాబాద్

ఆట‌ల చ‌దువుతో సంపూర్ణ వికాసం
– ఆపిల్ కిడ్స్ క‌ర‌స్పాండెంట్ వెంక‌ట్ రెడ్డి
– స్కూల్‌లో ముగిసిన స‌మ్మ‌ర్ క్యాంపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : చిన్న‌త‌నంలోనే చిన్నారుల‌కు ఆట‌ల ప‌ద్ద‌తిలో విద్య‌నందించ‌డం ద్వారా వారిలో సంపూర్ణ వికాసం పెంపొందుతుంద‌ని తాండూరు ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్ క‌ర‌స్పాండెంట్ పెరుమాళ్ల వెంక‌ట్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం, ఉత్సహాన్ని పెంపొందించేందుకు ఆపిల్ కిడ్స్ స్కూల్లో 40 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ వనజ విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్బంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచి క్రీడా పద్ధతిలో విద్యాబోధన చేయడంతో సంపూర్ణ వికాసం తోపాటు శారీరక మానసిక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు. అందుకు ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్ లో విద్యార్థులకు క్రీడా పద్ధతులతొ బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే ఫీజుతో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హారిక, సుష్మా, కావ్య, మంజుల తదితరులు ఉన్నారు.