అసలు సిసలు హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ

తాండూరు రాజకీయం వికారాబాద్

అసలు సిసలు హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ
– శివాజీ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి
– తాండూరులో ఘంగా హిందూ సామ్రాజ్య దివాస్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశంలో హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుప‌డిన అస‌లు సిస‌లు హిందూ సామ్రాజ్ చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అని తాండూరు బీజేపీ నేత‌లు కొనియాడారు. ఆదివారం తాండూరులో బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్స‌వం నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని శివాజీ చౌర‌స్తాలో ఉన్న చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ విగ్ర‌హానికి నేత‌లు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన మ‌హానీయుడు చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అని కొనియాడారు. ఆయ‌న ఆశ‌య సాధ‌న‌లో భాగంగా అంద‌రు హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అంతారం ల‌లిత‌, సాహు శ్రీ‌ల‌త‌, బాలప్ప, బీజేపీ సీనియర్ నాయకులు పాండు పూజారి, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, చంద్రశేఖర్, భాను పవార్, రామ్యా నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు దశరథ్ మోడీ, M రాజు, ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, పట్టణ కార్యదర్శి శివాజీ ఠాకూర్, రాంచందర్, కందనెల్లి సంగమేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు నీరటి రవి, కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రహ్లాద్ రావు తదితరులు పాల్గొన్నారు.