పట్లోళ్ల రాధమ్మకు అంతిమ వీడ్కోలు
– సంకిరెడ్డిపల్లి సర్పంచ్ అమృత్‌రెడ్డి తల్లి కన్నుమూత
– పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– అంత్యక్రియల్లో పాల్గొన్న నేతలు, ప్రజా ప్రతినిధులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి సర్పంచ్ అమృత్ రెడ్డి తల్లి పట్లోళ్ల రాధమ్మకు అంతిమ వీడ్కోలు జరిగింది. సర్పంచ్ అమృత్ రెడ్డి తల్లి అయిన రాధమ్మ రాధమ్మ (85) శుక్రవారం కన్నుమూశారు. దీంతో వారి నివాసంలో విషాధం అలుముకుంది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామంలోని అమృత్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకుముందు పట్లోళ్ల రాధమ్మ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సర్పంచ్ అమృత్ రెడ్డి, ఆయన సోదరులు అంజిల్ రెడ్డి, రాజమల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులను సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు గౌడి వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు శుక్రవారం గ్రామంలో రాధమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. రాధమ్మ కన్నుమూసిన విషయం తెలుసుకుని పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అమృత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల్లో రైతు సమన్వయ సమితి కోఆర్డీనేటర్ రాంలింగా రెడ్డి, రాధమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బందువులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


