అంగ‌న్‌వాడిలోనే బాల విద్య‌కు భ‌విత‌

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అంగ‌న్‌వాడిలోనే బాల విద్య‌కు భ‌విత‌
– చ‌క్క‌ని చ‌దువుకు స‌ర్కారు బ‌డిలో చేర్పించాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూఉ, ద‌ర్శిని ప్ర‌తినిధి : అంగ‌న్ వాడి కేంద్రాల్లోనే బాల‌ల విద్య‌కు భ‌విత‌ను క‌ల్పిస్తుంద‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు పేర్కొన్నారు. సోమ‌వారం మున్సిప‌ల్ ప‌రిధి 9వ వార్డ్ సాయిపూర్ లోని అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు ముఖ్యఅతిథిగా సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు అక్ష‌రాభ్యాసం చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య అందుతుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు. అదేవిధంగా అంగ‌న్‌వాడిలో చిన్నారి బాల‌ల‌కు ఉన్న‌త‌మైన విద్య అందుతుంద‌న్నారు. 3సంవత్సరాల పిల్లల‌కు ఆట పాటల ద్వారా విద్యను అందించ‌డం ద్వారా వారికి మంచి భ‌విత ఏర్ప‌డుతుంద‌న్నారు.

అనంతరం చిన్నారులతో సరదాగాకాసేపు కాలక్షేపం చేశారు.. గర్భిణులకు పోషక ఆహారం పై అవగాహన క‌ల్పించారు. అంగన్వాడీ కేంద్రాలలో సాముహిక సీమంతాలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గర్భిణీలకు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నవీణా,అఫ్రీన్ బేగం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.