తాండూరు ప్రజల సురక్షితంపై దృష్టి
– 24 గంటలు అందుబాటులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
– ఇబ్బందులు ఉంటే క్యాంపు కార్యాలయంలో సంప్రదించండి
– తాండూరు టీఆర్ఎస్ నాయకుల సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సురక్షతంపై దృష్టిసారిస్తున్నట్లు తాండూరు టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సినీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస చారి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాల ఇబ్బందులపై దృష్టిసారిస్తున్నామన్నారు. తాండూరు పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో వర్షాభావ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ప్రజలు వర్షాలు తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తాండూరు ఎమ్మెల్యే, లేదా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 24 గంటల పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సురక్షితంగా ఉండేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ పరికరాలను, సంబాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మంతు, సోషల్ మీడియా ఇంచార్జ్ ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.



