ఆలయాల్లో శమి వృక్షాలకు మరింత ప్రవిత్రత
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త
– వైష్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20 మొక్కల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎంతో పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర వృక్షం శమి మొక్కలను ఆలయాల్లో నాటడం వల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త అన్నారు. తెలంగాణ ఎంపీ జొగినిపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపు మేరకు సభ్యులు రొంపల్లి సంతోష్‌కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయాల్లో శమి వృక్షాలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై
పట్టణంలోని అంతప్ప బావి శివాలయంలో శమి మొక్కను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షమైన శమి మొక్కను ప్రతి ఆలయంలో ఉండేలా చూడడం అభినందనీమన్నారు. ఎంతో పవిత్రమైన శమి మొక్కలు ఆలయాల్లో ఉండడం వల్ల దానికి మరింత పవిత్రత లభిస్తుందని అన్నారు. అదేవిధంగా ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త సహాకారంలో పట్టణంలోని వివిధ ఆలయాల్లో 20 మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అశోక్, ఆలయ పూజారులు శివ కుమార్ స్వామి, గౌరిశంకర్ స్వామి, ఫెడరేషన్ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
