అమ్మవార్లను దర్శించుకున్న టీఆర్ఎస్ నేతలు
– పూజలు నిర్వహించిన డా.సంపత్ కుమార్, నీరటి హన్మంతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరిగాయి. పాత తాండూరు మాణిక్ నగర్‌లో మైసమ్మ దేవాలయంలో అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై పూజలు చేశారు. అదేవిధంగా తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, టీఆర్ఎస్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటీ హన్మంతులు కూడ అమ్మవారికి దర్శించుకున్నారు. అమ్మవారిని వేడుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులతో పాటు ప్రధాన నాయకుల రాకతో మాణిక్ నగర్ సందడిగా మారింది. జాతర ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించడం పట్ల డాక్టర్ సంపంత్ కుమార్ స్థానికులను, నిర్వహకులను అభినందించారు. జాతర ఉత్సవాలకు తమవంతు సహాకారం ఉంటుందని ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటీ హన్మంతు తెలిపారు.



