తాండూరు ప్రజలకు శుభవార్త..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు ప్రజలకు శుభవార్త..!
– 17న ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం
– స్థలం, సమయం వివరాలు ఇవే
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంతాన సమస్యలతో బాధపడే తాండూరు వాసులకు ఇది శుభవార్త. హైదరాబాద్ జూహీ ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

తాండూరుకు చెందిన ఆదిత్య ఆసుపత్రి సహాకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 17న మంగళవారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు శిబిరం కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ శిబిరంలో డా. నిర్మలా అగర్వాల్‌ హాజరై వైద్య సేవలు అందిస్తారని చెప్పారు.

ఐవీఎఫ్‌/ఐసీఎస్ఐ/ఐయూఐ, ఎగ్‌ ఫ్రీజింగ్, లాపరోస్కోపి, స్టెమ్ సెల్ థెరపీ, పీఆర్పీ(ప్లేట్లెట్- రిచ్ ప్లాస్మా), పురుషులలోని వంధ్వత్వం, అధిక ప్రమాద గర్భధారణ సంరక్షణలో వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. ఈ శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్‌: 9505864619, 9393222207లకు సంప్రదించాలన్నారు.

సుస్థిర సుందరీకరణే ధ్యేయం