హ్యాపీ బ‌ర్త్ డే @ కేటీఆర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్..!
– తాండూరులో ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు తాండూరు టీఆర్ఎస్ నేత‌లు హ్యాపీ బ‌ర్త్ డే చెప్పారు. ఆదివారం టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ ఎస్సీ సెల్ అధ్య‌క్షులు నీర‌టీ హ‌న్మంతు ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వ‌హించారు. ఇటీవల హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో శంకుస్థాప‌న చేసిన అంబేద్క‌ర్ భ‌వ‌న్ వ‌ద్ద ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ఈ వేడుల‌కు హాజ‌రైన టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం)తో పాటు నీర‌టి హ‌న్మంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని, తండ్రి కేసీఆర్ మార్గంలోనే మంత్రి కేటీఆర్ అన్ని వ‌ర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కాలుకు గాయ‌మైన కేటీఆర్ ఆరోగ్యంగా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ద‌ళితుల కోసం ద‌ళిత భ‌వ‌న్ ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అనంత‌రం స్వీట్లు పంచుకుని శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, ప‌ట్ట‌ణ ఉపాధ్య‌క్షులు విజ‌య్ కుమార్, ఖాంజాపూర్ స‌ర్పంచ్ ల‌లిత గోసాయి, మార్కెట్ క‌మిటి డైరెక్ట‌ర్ మ‌ల్ల‌ప్ప‌, న్యాయ‌వాది సుధాక‌ర్ గోసాయి, నాయ‌కులు జావిద్, నీర‌టీ దినేష్‌, నీర‌టి శ్రీ‌ను, చిన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.