ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
– ఆక‌ట్టుకున్న విద్యార్థుల వేషాధారాణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని ఆపిల్ కిడ్స్ పాఠ‌శాల‌లో చిన్నారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను వైభవంగా జ‌రుపుకున్నారు. ఆషాఢ‌మాసం సంద‌ర్భంగా పాఠ‌శాల‌లో బోనాల సంబ‌రాల‌ను నిర్వ‌హించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా చిన్నారుల త‌ల్లుల‌తో ఆషాఢ మాసం గొరింటాకు సంబ‌రాల‌ను జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల‌ వెంకట్ రెడ్డి, పిన్సిపల్ పెరుమాళ్ల‌ వనజ రెడ్డి, ఉపాధ్యాయులు సుష్మా, హారిక, అరుణ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.