అధికార యంత్రాంగం అప్రమత్తం..!
– కాలనీల్లో పర్యటించిన కమీషనర్ షపీవుల్లా
– ఆపద ఉంటే కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాల నేపథ్యంలో తాండూరు మున్సిపల్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని సాయిపూర్‌లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. కాలనీలో రోడ్లపై నీటి ప్రవాహాం, మురుగు కాలువల దుస్థితిని సమీక్షించారు. వెంట వచ్చిన శానీటరి ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్, సిబ్బందితో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేవించారు. అంతకుముందు కమీషనర్ షపీవుల్లా అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పట్టణంలో భారీ వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందుల పరిష్కారం, బాధితులకు సహాయక చర్యలు, ఇతర కార్యకలాలపై చర్చించారు.
పట్టణ ప్రజల కోసం కార్యాలయంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై శానిటరీ ఇను స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు శిథిలావస్య పురాతన ఇండ్లలో ఉండే ప్రజలు తాత్కాళికంగా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా సూచనలు చేశారు. ఎవరైనా ఆపదలో గాని, అత్యవసర పరిస్థితిలో ఉంటే కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూం కోసం ప్రజలు ఫోన్ నెంబర్: 08411-272021 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాధం, ఏఈ ఖాజా, శానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్ కుమార్, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…


