ఉప్పొంగుతున్న వాగులు
– తాండూరు కాగ్నాలోకి భారీగా వరధ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో వాగులు ఉప్పోంగుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాండూరు, కోకట్ కాగ్నా నదుల్లోకి భారీగా వరధ నీరు చేరుతుంది. కోకట్తో పాటు తాండూరు కాగ్నా నదులకు నీటి మట్టం పెరిగి.. ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరులోని కాగ్న నదిపై ఉన్న పురాతన వంతెనను ఆనుకుని వరధనీరు ప్రవహిస్తోంది. క్రమంగా ఈ నీటి ప్రవహాం ఇంకా పెరిగే అవకాశం ఉండగా గతంలో పాత వంతెనకు చేసిన మరమ్మత్తులకు మళ్లీ ప్రమాదం ఏర్పడే వీలు కూడ ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరధ నీటి ప్రవాహాంతో కాగ్నా నది ఉధృతి రూపం దాల్చింది. నదిలోకి నీరు రావడంతో తిలకించేందుకు పట్టణ వాసులు కాగ్న కొత్త వంతెనకు చేరుకుంటున్నారు. మరోవైపు పెద్దేముల్ మండలం గాజీపూర్ వాగు కూడ ఉధృతంగా ప్రవహించింది.




