వీఆర్ఏలను ఆదుకోవడంతో స‌ర్కారు విఫ‌లం

తాండూరు రాజకీయం వికారాబాద్

వీఆర్ఏలను ఆదుకోవడంతో స‌ర్కారు విఫ‌లం
– వారికి పే స్కేల్ వెంటనే అమలు చేయాలి
– సీపీఎం నాయ‌కులు బుగ్గ‌ప్ప‌, కేవీపీఎస్ నాయ‌కులు ఉప్ప‌లి మ‌ల్క‌య్య‌
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : అధికారుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ద్య వార‌ధిగా ఉన్న వీఆర్ఏల‌ను ఆదుకోవడంతో తెలంగాణ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యింద‌ని సీపీఎం యాలాల‌ మండ‌ల కార్య‌ద‌ర్శి బుగ్గ‌ప్ప‌, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్య‌క్షులు ఉప్ప‌లి మ‌ల్క‌య్య‌లు విమ‌ర్శించారు. వీఆర్ఏల స‌మస్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర క‌మిటి పిలుపు మేర‌కు యాలాల మండల కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేప‌ట్టిన సమ్మెకు సీపీఎం మండల కార్యదర్శి యు.బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామిని విస్మ‌రించంద‌న్నారు. వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకోవ‌డం దుర్మార్గామ‌న్నారు. గ్రామ స్థాయిలో వీఆర్ఏలు అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పని చేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనులు చేస్తున్న వీఆర్ఏలకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం VRA లకు కనీస వేతనం 21 వేలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా 55 సంవత్సరాలు నిండిన పిల్లలకు ప్రమోషన్లు కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు బాలకృష్ణయ్య, వీఆర్ఏలు శ్రీకాంత్, మైపాల్, మల్లప్ప, శ్రీనివాస్, రాములు, వెంకటమ్మ, అలవేలు, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.