శివాజీ ఆశయాలను నెరవేర్చాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

శివాజీ ఆశయాలను నెరవేర్చాలి
– కరణికోట్‌లో ఘనంగా శివాజీ జయంతి
– నివాళులు అర్పించిన యువకులు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చత్రపతి శివాజీ ఆశయాలను నెరవేర్చేందుకు అందరు కృషి చేయాలని తాండూరు మండలం కరణ్ కోట్ చత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు, యువకులు అన్నారు. ఆదివారం కరణ్ కోట్ గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ చిత్రపటంతో పాటు భారీ ఫ్లెక్సీకి యువకులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం కోసం చత్రపతి శివాజీ ఎన్నో వీరోచిత పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు యువత ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్, అనిల్, రాజు, శివప్రసాద్, అక్షయ్, సుధీర్, ఎల్లు సురేష్, అశోక్, శ్రీకాంత్, మోహన్, ప్రభాకర్, శివాజీ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.