హిందూవులారా తరలిరండి..!
– రేపు హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం
– తాండూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు
– హాజరు కానున్న మాన్యశ్రీ జగదీస్ కారంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్మపరిరక్షులారా.. హిందూవులారా.. రండి.. తరలిరండి.. అని హిందూ వాహిని సభ్యులు పిలుపునిచ్చారు. రేపు తాండూరు పట్టణంలో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లు చేసినట్లు హిందూ వాహని సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

హిందూ వాహాని వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రేపు శనివారం సాయంత్రం 5 గంటలకు పట్టనంలోని తులసీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిల భారతీయ ప్రశిక్షణ టోలీ సభ్యులు మాన్యశ్రీ జగదీస్ కారంత్ (దక్షిణ మద్య సంయోజక్) హాజరు కానున్నారు.

హిందూ ధర్మ పరిరక్షకులను ఒకే వేదికపై తీసుకరావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హిందూ బందువులందరు భారీ ఎత్తున తరలించి ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ వాహిని సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి..

