దేవుళ్లను దర్శించుకున్న పటేల్ జయశ్రీ
– రాస్నంలో మల్లికార్జున, వీరాంజనేయ స్వామిలకు పూజలు
యాలాల, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వార్లను బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ రవిశంకర్ దర్శించుకున్నారు. సోమవారం మల్లికార్జున స్వామి, వీరాంజనేయ స్వామి దేవాలయాల ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పటేల్ జయశ్రీ గ్రామాలలోని దేవాలయాలను సందర్శించారు. ఆయా దేవాలయాలలో వెలసిన స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావాలి సురేఖ, ఉపసర్పంచ్ జనార్దన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు హన్మంత్ ముదిరాజ్, యాలాల మండలం అధ్యక్షుడు మహిపాల్, నాయకులు రామ్యనాయక్, వెంకటరెడ్డి, ప్రవీణ్, రమేష్, నరేష్, నవీన్, మధు మోదీ గ్రామస్తులు పాల్గొన్నారు.



