న‌మోః రాచ‌న్న స్వామి

తాండూరు వికారాబాద్

న‌మోః రాచ‌న్న స్వామి
– ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో శివుడు ద‌ర్శ‌నం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలోని భావిగి భ్ర‌దేశ్వ‌రాల‌యంలో శివుడు రాచ‌న్న స్వామిగా ద‌ర్శ‌న‌మించ్చారు. శ్రావ‌ణ మాసం మొద‌టి సోమ‌వారంను పుర‌స్క‌రించుకుని ఆల‌య పూజారి విజ‌య్ కుమార్ స్వామి ఆల‌యంలో వెల‌సిన శివున్ని సంగారెడ్డి జిల్లా బ‌డెంపేట్ గ్రామంలో వెల‌సిన శ్రీ రాచ‌న్న స్వామిగా అలంక‌ర‌ణ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న భ‌క్తులు ఆల‌యానికి పెద్ద ఎత్తున చేరుకుని రాచ‌న్న స్వామిగా ద‌ర్శ‌న‌మిచ్చిన శివునికి పూజ‌లు నిర్వ‌హించారు. స‌ల్లంగా చూడు స్వామి అంటూ శివున్ని వేడుకున్నారు. మ‌రోవైపు శ్రావ‌ణ‌మాసం, కార్తీక మాసాలలో ఆల‌య పూజారి విజ‌య్ కుమార్ స్వామి శివునికి ప్ర‌త్యేకంగా అలంక‌రిస్తూ భ‌క్తిని చాటుకుంటారు.