ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
– ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
– పాల్గొన్న చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు పేర్కొన్నారు. భారత 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలను తాండూరులో వైభవంగా ప్రారంభించారు. మంగళవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తన వార్డులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు కూడ తన వార్డు సాయిపూర్లో ఇంటింటికి వెళ్లి జెండాలను అందజేశారు. మరోవైపు మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు వార్డుల్లో, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది, ఆర్పీలు కూడ ప్రతి వార్డుల్లో ఇంటింటికి వెళ్లి మువ్వెన్నల జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ తో పాలు పలువురు మాట్లాడుతూ దేశభక్తిని చాటే విధంగా అందరు ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. ఆజాదికా అమృతోత్సవ్, వజ్రత్సోవాలలో అందరు భాగస్వాములు కావాలన్నారు.



