కడుపులో ఐదు కిలొల కణితి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

కడుపులో ఐదు కిలొల కణితి
– ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
– తాండూరు బాలాజీ నర్సింగ్ హోమ్‌లో వైద్యుల కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాలుగు ఏండ్లుగా ఓ మహిళ కడుపులో కణితి పెరుగుతూ వచ్చింది. ఆపరేషన్ ద్వారా వైద్యులు ఆమె కడుపులో ఉన్న కణితిని తొలగించారు. తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ నర్సింగ్‌ హోమ్‌లో వైద్యులు నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ గత నాలుగు ఏండ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఇటీవల తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ లో వైద్యులను సంప్రదించగా స్కానింగ్ తీయించారు. దీంతో ఆమె కడుపులో కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ మేరకు గురువారం లక్ష్మీకి శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అయితే లక్ష్మీకి గుండె సంబంధిత సమస్య ఉండడంతో డాక్టర్ భరత్ పురోహిత్ పర్యవేక్షణలో బాలాజీ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ రమణప్ప, డాక్టర్ సార్, డాక్టర్ నీరజలు ఆపరేషన్ చేశారు. లక్ష్మీ కడుపులో పెరుగుతున్న కణితిని విజయవంతంగా బయటకు తీశారు. దాని బరువు దాదాపు 5 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం లక్ష్మీ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మీకి ఆపరేషన్ చేసి కణితిని తొలగించిన వైద్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.