జెండా ఊంచా రహేగా
– తాండూరులో తిరంగా యాత్ర
– కదిలొచ్చిన ముస్లిం యువత
తాండూరు, దర్శిని ప్రతినిధి: జెండా ఊంచా రహేగా హమారా అంటూ తాండూరు ముస్లిం యువత నినాదాలతో హోరెత్తించారు. ఆజాదీకా అమృతోత్సవ్, వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం తాండూరు ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరంగా యాత్రను అట్టహాసంగా చేపట్టారు. అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే చౌరస్తా నుంచి తిరంగా యాత్రను ప్రారంభించారు. ర్యాలీలో ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురవీధుల్లో కొనసాగిన ర్యాలీలో ముస్లిం సోదరులు జాతీయ జెండాను ఊరేగిస్తూ జెండా ఊంచా రహేగా హమారా అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకుని ముగిసింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు. దేశం కోసం దేనికైనా సిద్దంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ అలీం, ప్రతినిధులు సాజిద్ పటేల్, జావిద్, ఈర్షాద్, ఇంతియాజ్, పాషా ఖురేషి, సమద్, అదమ్ ఖాన్, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.



