సీఎం పర్యటనలో పటిష్ట బందోబస్తు
– 1600ల సిబ్బందితో పహారా
– ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా
– పరిగి, తాండూరు, ధారూర్ మార్గాలలో ఆంక్షలు
– పర్యటను అడ్డుకుంటే కఠిన చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పర్యటనకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లాలో మొత్తం 1600 పోలీస్ సిబ్బంది ద్వారా పరాహా నిర్వహిస్తున్నట్లు వెల్డలించారు. నలుగురు ఎస్పీలు, 6గురు ఏఎస్పీలు, డీఎస్పీలు, ఎస్ ఐలు విధుల్లో ఉంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
సీఎం పర్యటన ఇలా కొనసాగితే…
వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనకు సబంధించి పలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2-2:30 గంటల మద్య వికారాబాద్‌కు హెలిప్యాడ్ ద్వారా ఎస్పీ కార్యాలయంకు చేరుకుంటారని , అక్కడి నుంచి నుంచి టీఆర్ఎస్ భవన్ కు చేరుకుని ప్రారంభిస్తారన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే నివాసానికి సీఎం వెలితే బ్రిడ్జీ పై నుంచి ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే అవకాశం ఉందన్నారు. అలా జరగకపోతే సీఎం నేరుగా టీఆర్ఎస్ భవన్ నుంచి కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ ఉంటుందన్నారు. అనంతరం పబ్లిక్ మీటిెగ్ ఉంటుందన్నారు.
ట్రాఫిక్ అంక్షలు
వికారాబాద్ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. పరిగి మార్గంలో రెండు గంటల ముందుగా దారులు స్థంభిస్తామన్నారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను మన్నెగూడ మీదుగా తరలిస్తామన్నారు. హైదరాబాద్ తాండూర్ మధ్య రాక పోకలను పరిగి కొడంగల్ మీదుగా దారి మల్లించడం జరుగుతుందన్నారు. తాండూరు, కోడంగల్, పరిగి, చేవేళ్ల నుంచి సీఎం పర్యటనకు వచ్చే వారికి సభాస్థలికి అర కిలో మీటర్ దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొందరు ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటన చేశారని అలా చేసే వారిపై ప్రత్యేకంగా ఉంటుందని అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ప్రాసులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.



